![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -813 లో..... అపర్ణ నిజం చెప్పడంతో రాజ్ కళ్ళు తిరిగి పడిపోతాడు. వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. అనవసరంగా నేనే నిజం చెప్పాను. అందుకే ఇలా జరిగిందని అపర్ణ బాధపడుతుంది. అప్పుడే యామిని వచ్చి ఏం యాక్టింగ్ చేస్తున్నారు.. ఒకరిని మించి మరొకరు అని అంటుంది.
మీ కంటే నేనే బెస్ట్.. రాజ్ ని కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్న.. మీ వల్లే తనకి ఈ సిచువేషన్ వచ్చిందని యామిని అంటుంటే.. కావ్య తన చెంపచెల్లుమనిపిస్తుంది. ఏంటి ఎక్స్ ట్రా మాట్లాడుతున్నావ్.. నీ గురించి ఇక్కడ అందరికి తెలుసు.. నా భర్త నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావు.. నీది ఒక బ్రతుకేనా అని కావ్య కోప్పడుతుంది. దాంతో యామినిని రుద్రాణి పక్కకు తీసుకొని వెళ్తుంది. దాని సంగతి చెప్తాను నన్నే కొడుతుందా అని యామిని అంటుంది. నిజం చెప్పాలంటే నీకు వాళ్ళని అనడానికి ఏం రైట్ ఉంది.. కావ్య భర్త రాజ్.. సర్వహక్కులు తనకే ఉంటాయని యామినితో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్ స్పృహలోకి వస్తాడు.
కళావతికి ఇప్పుడు బాగుందా.. మేం వెళ్తుంటే మాకు ఆక్సిడెంట్ అయింది కదా అని రాజ్ అంటాడు వెంటనే అందరు డాక్టర్ ని పిలుస్తాడు. ఏదో ఇంజక్షన్ వెయ్యగానే మళ్ళీ రాజ్ స్పృహ కోల్పోతాడు. తరువాయి భాగంలో రాజ్ ని అపర్ణ వాళ్ళు ఇంటికి తీసుకొని వస్తారు. పాపం కావ్య నీకు గతం గుర్తుచెయ్యలేక తన కడుపులో బిడ్డకి తండ్రి నువ్వే అని చెప్పలేక నరకం అనుభవించిందని అపర్ణ చెప్పగానే కావ్య దగ్గరికి రాజ్ వెళ్తాడు. దాంతో కావ్య హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |